హైదరాబాద్ (జూలై – 01) : తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఆన్లైన్ విధానం దోస్త్ మూడో విడత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ (DOST 2023 3rd PHASE REGISTRATION ) నేడు ప్రారంభం కానుంది. నేటి నుండి జూలై 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
జులై 15 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక., జూలై 14న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉండనుంది.
మూడో విడత సీట్ల కేటాయింపు జూలై 20న చేయనున్నారు. జులై 24న మూడవ విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
రెండో విడతలో 49,267 సీట్లు కేటాయింపు చేశారు. రెండో విడతలో సీట్లు పొందినవారు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టు చేయడానికి జూలై 14 వరకు గడువు ఇచ్చారు.