హైదరాబాద్ (జూన్ – 30) : డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST – 2023) ద్వారా రెండో దశ సీట్ల కేటాయింపు (dost 2nd phase seats allotment) ఈరోజు చేయనున్నారు. మొదటి దశలో 73,220 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.
◆ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ :
రెండో దశలో సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి జూలై 01 నుంచి 05 వరకు గడవు కలదు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కళాశాల ఫీజును చెల్లించవచ్చు.
◆ మూడో దశ కౌన్సెలింగ్ :
జూలై 01 నుండి 05 వరకు DOST 2023 మూడో దశ దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అవకాశం కలదు. వెబ్ ఆప్షన్లు జూలై 01 జూలై 06 వరకు కలదు. జూలై 10న మూడో దశ సీట్ల కేటాయింపు జరగనుంది. మూడో దశలో రిజిస్ట్రేషన్ కోసం 400/- రూపాయల రుసుము చెల్లించాలి.
◆ వెబ్సైట్ : https://dost.cgg.gov.in/