DOST గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి మొదటి దశ అడ్మిషన్ల పొందడానికి గడువు జూలై 24 వరకు పొడిగిస్తూ దోస్త్ కన్వీనర్ లింబాద్రి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజుతో గడువు ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

మొదటి దశలో సీట్ పొందిన విద్యార్థులకు సీటు అలాట్మెంట్ ను జూలై 31వ తేదీన వెల్లడిస్తారు.

సీటు పొందిన విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి ఆగస్టు 1 నుండి 5వ తేదీ వరకు సమయం ఇచ్చినట్లు కన్వీనర్ తెలిపారు.

రెండవ దశ రిజిస్ట్రేషన్ గడువు

అలాగే రెండవ దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 1 నుండి ఆగస్టు 9 వరకు జరుగుతుందని తెలిపారు రెండవ దశ లో వెబ్ ఆప్షన్ల గడువు ఆగస్టు 2 నుండి ఆగస్టు 9 వరకు కలదని తెలిపారు.

స్పెషల్ కేటగిరి అభ్యర్థులకు వెరిఫికేషన్ ప్రక్రియ ఆగస్టు 6వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. వీరికి సీట్ అలాట్మెంట్ ఆగస్టు 14న చేయనున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు.