BIKKI NEWS (JUNE 07) : DONALD TRUMP vs ELON MUSK. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ కు పూర్తి సహకారం అందించిన మస్క్ తాజాగా ట్రంప్ తో ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తున్నారు.
DONALD TRUMP vs ELON MUSK.
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎఫ్‌స్టీన్ తో ట్రంప్ కు సంబంధాలు ఉన్నాయని మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ఆ దర్యాప్తుకు సంబంధించిన ఫైల్ ను ట్రంప్ బయట పెట్టడం లేదని ఆరోపించారు. ట్రంప్ ను అభిశంశించి ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కు అధ్యక్షత భాద్యతలు అప్పగించాలని మస్క్ కామెంట్ చేశారు.
అమెరికన్లలో కనీసం 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపనపై ఒపీనియన్ పోల్ ను కూడా పెట్టారు.
మస్క్ వంటి ఈ వ్యక్తి డోజ్ పదవిని నెలల క్రితమే వదిలేసి ఉంటే బాగుండేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. బ్యూటిఫుల్ బిల్లులో టెస్లా అధినేత మస్క్ కు ఆశించిన లబ్ధిని చేకూర్చకపోవడంతోనే తనపై నిందారోపణలు చేస్తున్నారని ట్రంప్ దుయ్యబట్టారు. మస్క్ కు మతి చలించిందని ఘాటు విమర్శలు చేశారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్