రాష్ట్ర అధికారిక కార్యక్రమాలుగా దొడ్డి కొమురయ్య జయంతి, వర్థంతి

హైదరాబాద్ (ఎప్రిల్ – 02) : దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతిలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసింది.

ఎప్రిల్ – 03 న దొడ్డి కొమురయ్య జయంతిని, జూలై – 04న వర్థంతిని అధికారికంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యమకారులకి రాజకీయ శిక్షణ పాఠశాలగా దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ చారిత్రక పాత్ర నిర్వహించింది. ప్రతిసారి అప్పటి మహోజ్వల చరిత్ర నూతన తరాలకు తెలియడానికి ప్రభుత్వమే కొమురయ్య జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని పలు సార్లు ప్రభుత్వానికి నివేదించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు లకు ధన్యవాదాలు తెలిపారు.