మూడు వేల అధ్యాపక పోస్టులు రద్దు.

తెలంగాణలోని 64 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో ఉన్న దాదాపు 3000 డిగ్రీ అధ్యాపక పోస్టులను రద్దు చేస్తున్నట్లు కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

2006 నుండి ఈ పోస్టులపై నిషేధం ఉంది ఈ పోస్టులో ఉన్నవారు పదవి విరమణ చేయడమే కాని నూతనంగా నియామకాలు జరపకుండా 2006లో అప్పటి ప్రభుత్వం నిషేధం విధించింది.

దీంతో అప్పటి నుంచి ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో ఈ పోస్టులను ఖాళీగా చూపిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఆ పోస్టులను రద్దు చేస్తున్నట్లు కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు.

Follow Us@