UGC NEWS : దూరవిద్య డిగ్రీ

న్యూఢిల్లీ (సెప్టెంబర్ – 10) : యూజీసీ (ugc news) గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి ఆన్లైన్, దూరవిద్యా విధానంలో పొందిన డిగ్రీలకు సంప్రదాయ డిగ్రీలతో సమానంగా పరిగణిస్తారని యూజీసీ లిఖిత పూర్వకంగా స్పష్టం చేసింది.

ఉన్నత విద్యా సంస్థలు ఓపెన్, దూరవిద్య, ఆన్లైన్ విధానంలో అందజేసే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలకు, సంప్రదాయ విధానంలో చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలతో సమానం’ అని యూజీసీ సెక్రటరీ రజినీష్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.