హైదరాబాద్ (ఎప్రిల్ – 21) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) బి.ఎడ్, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (Diatance BEd) ప్రవేశ పరీక్ష 2022 – 23 కు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
దరఖాస్తు గడువు మే 22 తేదీ వరకు కలదు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు 1,000/- రూపాయలు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 750/-
బి.ఎడ్ జూన్ 6వ తేదీన ప్రవేశ పరీక్ష ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది… బి.ఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు జరగనుంది.