దేశంలో త్వరలోనే డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభిస్తామని యూజీసీ చైర్మన్ జగదీష్‌కుమార్ అన్నారు. విద్యను అందరికీ అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ యూనివర్సిటీపై కమిటీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. విద్యావ్యవస్థలో డిజిటల్ యూనివర్సిటీ వినూత్న మార్పులు తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సీట్ల కొరత కారణంగా పెద్ద వర్సిటీల్లో చదువుకోలేనివారికి డిజిటల్ యూనివర్సిటీ ఒక వరప్రదాయిని అని ఆయన అన్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల తమకు నచ్చిన వర్సిటీల్లో విద్యార్థులు డిగ్రీలు పొందవచ్చన్నారు. యూజీసీ స్థానంలో హెకీ కూడా ఏర్పాటు కాబోతోందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని జగదీష్ పేర్కొన్నారు.
Credits :- abn