కరోనా కారణంగా తగ్గించబడిన జీతాల చెల్లింపుకు నిర్ణయం

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తగ్గించి ఇచ్చిన జీతాలు, పెన్షన్లను తిరిగి చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కరోనా కారణంగా 2020 మార్చి మరియు ఏప్రిల్ నెలలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ లలో కొంత శాతం తగ్గించి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తగ్గించబడిన జీతాలను, పెన్షన్లను ప్రస్తుతం చెల్లించడానికి ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి మరియు ఎప్రిల్ నెలల జీతాలు మరియు పెన్షన్లలో కోత విధించింది.. మార్చి కి సంబంధించిన జీతాలను డిసెంబర్ నెలలో, ఏప్రిల్ కు సంబంధించిన జీతాలను 2021 జనవరి నెలలో ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా కారణంగా తగ్గించబడింది జీతాలను ఉద్యోగుల పెన్షనర్ల ఎకౌంట్లో వేయడానికి ఉత్తర్వులను జారీ చేస్తూ దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఉత్తర్వులను వెలువరించింది.

Follow Us@