మానవ శరీరంలోని వివిధ గ్రంథులు – విధులు

1) థైరాయిడ్ గ్రంథి :-

స్థానం :- గొంతు వద్ద వాయు నాళాన్ని ఆనుకుని

ఉత్పత్తి చేసే హర్మోన్ :- థైరాక్సిన్

లోపిస్తే వచ్చే వ్యాధులు :- గాయిటర్, క్రెటినిజం, మిక్సేడెమా

విశేషాలు :- థైరాక్సిన్ లో అయోడిన్ అనే మూలకం ఉంటుంది. ఇది లోపిస్తే గొంతు కింద వాపు వస్తుంది. దీన్ని గాయిటర్ వ్యాధి అంటారు. యుక్తవయస్సు వారిలో ఈ హార్మోన్ లోపిస్తే క్రెటినిజం, పెద్ద వయసులో లోపిస్తే మిక్సేడెమా అనే వ్యాధులు వస్తాయి.

2) పిట్యూటరీ గ్రంథి (పియూష గ్రంథి, మాస్టర్ గ్లాండ్) :-

స్థానం :- మెదడు కింద బాగంలో

ఉత్పత్తి చేసే హర్మోన్ :- దాదాపు 10 హర్మోన్ లను

లోపిస్తే వచ్చే వ్యాధి :- మరుగుజ్జుతనం

విశేషాలు :- ఈ గ్రంధి సరిగా పని చేయకపోతే మరుగుజ్జుతనం ఏర్పడుతుంది ఈ గ్రంధి దాదాపు పది హార్మోన్లను స్రవిస్తుంది. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు.

3) అడ్రినల్ గ్రంధి (అథివృక్క గ్రంథి) :-

స్థానం :- మూత్ర పిండాలపై

ఉత్పత్తి చేసే హర్మోన్ :- ఎడ్రినలిన్

విశేషాలు :- కోపం, ఒత్తిడి, భయానికి గురి అయినప్పుడు ఎడ్రినలిన్ విడుదల అవుతుంది. ఫలితంగా హృదయ స్పందన పెరిగి రక్తసరఫరా రేటు అధికమవుతుంది.

4) పారాథైరాయిడ్ గ్రంథి :-

స్థానం :- థైరాయిడ్ గ్రంధి వద్ద

ఉత్పత్తి చేసే హర్మోన్ :- పారాథార్మోన్

విశేషాలు :- ఎముకల వృద్ధికి ఈ గ్రంధి అవసరం.

5) క్లోమ గ్రంథి :-

స్థానం :- జీర్ణాశయం కింద

ఉత్పత్తి చేసే హర్మోన్ :- ఇన్సులిన్

విశేషాలు :- ఇన్సులిన్ శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది ఇది సక్రమంగా విడుదల కాకుంటే మధుమేహం (షుగర్) వ్యాధి వస్తుంది.

Follow Us @