నైతిక విలువల బోధనకై చరిత్ర అవసరం – డిఐఈఓ దశ్రు నాయక్

నల్గొండ (జూలై – 11) : జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు సోమవారం రోజున ఉమ్మడి నల్లగొండ జిల్లా చరిత్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ HEC కోర్సులో అడ్మిషన్లు పెంచడానికి రూపొందించిన చరిత్ర వాల్ పోస్టర్ ను జిల్లా డీఐఈఓ దశ్రు నాయక్ చేతులు మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా దశ్రు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం మరియు అనేక ప్రైవేట్ రంగాలలో ఉద్యోగం పొందాలంటే చరిత్రను తప్పకుండా చదవాలి అన్నారు. అలాగే నేటి విద్యార్థులలో, యువతలో నైతిక విలువలు పెంపోంది, మంచి సమాజం ఏర్పడాలంటే అది చరిత్ర భోధన వల్లనే సాధ్యమవుతుందని, చరిత్రకు పూర్వవైభవం తప్పకుండా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లింగమూర్తి, నగేష్ కమిటీ సభ్యులు జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us @