Home > UNCATEGORY > విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలి

విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలి

  • వరంగల్ ఇంటర్ విద్యాధికారి శ్రీధర్ సుమన్

BIKKI NEWS (DEC. 03) : DIEO sridhar suman visited gjc rangasaipeta. విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన ఇంటర్మీడియేట్ స్థాయిలో విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని వరంగల్ జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీధర్ సుమన్ అన్నారు.

DIEO sridhar suman visited gjc rangasaipeta.

రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల, పోషకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ విద్యా వికాసం కోసం అధ్యాపకులు, తల్లిదండ్రులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలై పోతున్నారని తెలిపారు. చదువు మీద, కుటుంబ బాధ్యతలపట్ల తల్లిదండ్రులు నిరంతరం వారితో మాట్లాడాలని అన్నారు.

రానున్న వార్షిక పరీక్షల్లో అధ్యాపకులు ప్రణాళిక బద్ధంగా బోధన చేసి మంచి ఉత్తీర్ణత ఫలితాలను సాధించాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులతో పాటు, ఉత్తీర్ణులు అయ్యేందుకు ప్రణాళికతో పని చేయాలని ఆదేశించారు. కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. సమయపాలన పాటించని అధ్యాపకులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తల్లిదండ్రులు మరియు లెక్చరర్ల సమిష్టి కృషి ద్వారానే సత్ఫలితాలు సాధించవచ్చునన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డి. సంపత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఇంటర్మీడియేట్ కమీషనర్ ఆదేశాలతో 95 రోజుల ప్రణాళిక సిద్ధం చేసి అందరు విద్యార్థులు పరీక్షలలో ఉతీర్ణులు అయ్యే విధంగా వారిని తీర్చిదిద్దుటకు తగు కృషి చేస్తున్నామని అన్నారు.

ఈ సమావేశంలో రిటైర్డ్ టీచర్ ప్రకాశ్, తల్లిదండ్రులు, AGMC రాములు నాయక్, అధ్యాపకులు మల్లారెడ్డి‌, ఎల్లస్వామి, మహాలక్ష్మి , సుధాకర్, మమత, రూపారాణి, లక్ష్మి, నరేష్, అనిల్, అనిత, రాజు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవాలో భాగంగా నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు విద్యాధికారి బహుమతులు అందజేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు