BIKKI NEWS : డయాబెటిస్ బాధితులకు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పరికరాన్ని ‘VIACITE’ అనే అమెరికా సంస్థ ‘VC -02’ అనే పరికరాన్ని (Diabetes insulin controlling chip) తయారు చేసింది. ఈ చిన్న చిప్ పరిమాణంలో ఉండే పరికరాన్ని చర్మం లోపల అమర్చుకోవడం ద్వారా ఇన్సులిన్ ను రక్తంలో బ్యాలన్స్ చేస్తుంది.
ఈ పరికరం శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచిదనట్లు క్లినికల్ ట్రయల్స్ లో నిర్ధారణ అయినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
చర్మంలో VC 02 పరికరాన్ని అమర్చిన ఆరు నెలల్లో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి చేరినట్లు క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైనట్లు తెలిపారు.
ఈ పరికరం అమర్చుకున్న డయాబెటిస్ బాధితులు ప్రతిరోజూ ఇన్సులిన్ సూది రూపంలో తీసుకోవాల్సిన అవసరం ఉండదు. త్వరలో దీనిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసి డయాబెటిస్ బాధితులకు అందుబాటులో ఉంచనున్నారు.