ధోనీ బౌద్ధ సన్యాసి రూపంలో దర్శనమిచ్చాడు. గుండుతో బుద్ధ సన్యాసి అవతారంలో నైరాశ్యంలో మునిగి ఉన్న ధోనీ గెటప్ ను చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.
బౌద్ధ సన్యాసి రూపంలో ఉన్న ధోనీ ఫొటోను స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఈ లుక్ గురించి ఏమనుకుంటున్నారో చెప్పాలని సూచించింది. దీనికి స్పందించిన నెటిజన్లు.. ఏదైనా యాడ్ షూటింగ్ కోసం ధోనీ ఇలా వేషం వేశాడని అభిప్రాయపడుతున్నారు. సన్యాసి అవతారంలో లేకపోయినా ధోనీ ఎప్పుడూ సౌమ్యుడిగానే ఉంటాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ధోనీ కొత్త లుక్ ఇప్పుడు వైరల్గా మారింది. ఈ బౌద్ధ సన్యాసి అవతారం వెనుక ఉన్న కారణాన్ని ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు వెల్లడించనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ తెలిపింది.
