యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు అందర్నీ రెగ్యులరైజ్ చేయాలి

ఖమ్మం (జూన్ – 03) : కాకతీయ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ పీజీ కళాశాల ఖమ్మంలో జరిగిన కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు సంఘం సమావేశంలో అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 38 ద్వారా 5,544 ఒప్పంద ఉద్యోగస్తులు, అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేశారని… యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అద్యాపకులు 1,335 మందిని కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015వ సంవత్సరంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా చేయటం జరిగింది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 1,335 మందిని రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేయటం జరిగింది.

ఈనెల ఆరో తేదీ నాడు కాకతీయ యూనివర్సిటీలొ మాజీ ఉపకులపతులైన ప్రొఫెసర్. యన్‌ . లింగమూర్తి గారు, మరియు ప్రొఫెసర్ ఎగ్బాల్ అలీ గారు తో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులేషన్ అనే అంశం పైన ఒక సదస్సును ఉన్నది కాబట్టి దాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు సంఘం గౌరవ సలహాదారులు డాక్టర్ రవికుమార్, డాక్టర్ టి గోపి, డాక్టర్ శ్యాంబాబు, పి మధు, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.