కాంట్రాక్టు ఉద్యోగులు/ లెక్చరర్స్ క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు జారీ చేయాలి.

  • ముఖ్యమంత్రి కేసీఆర్ “క్రమబద్ధీకరణ జీవో 16 అమలు” సాధన సమితి వినతి

తెలంగాణ రాష్ట్రం లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల/ లెక్చరర్స్ లను క్రమబద్ధీకరించడానికి వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు ఆన్ లైన్ ద్వారా ఈరోజు వినతి పత్రం పంపించినట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల/ లెక్చరర్స్ ” క్రమబద్ధీకరణ జీవో 16 అమలు “సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను /లెక్చరర్లను క్రమబద్ధీకరించడానికి తెలంగాణ ప్రభుత్వం 2016లో
జీవో నెంబర్ 16 జారీ చేయడం జరిగిందని…కానీ ఇద్దరు వ్యక్తులు దురుద్దేశంతో హైకోర్టుకు వెళ్లగా 2017 లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తాత్కాలికంగా నిలిపి వేయడం జరిగిందని… కాంట్రాక్టు ఉద్యోగులు /లెక్చరర్లు కూడా క్రమబద్ధీకరణకు అనుకూలంగా హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగిందని తెలిపారు

డిసెంబర్ -07 న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పిల్ 122/ 2017 లో గతంలో కాంట్రాక్టు క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టే ను ఎత్తివేసి, పిటిషన్ వేసిన ఇద్దరు వ్యక్తులకు జరిమానా విధించడం జరిగిందని… దీనితో కాంట్రాక్టు ఉద్యోగులు/ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు న్యాయస్థానాలు అడ్డంకులు తొలిగిపోయాయని గుర్తు చేశారు.

కానీ ,ఇంతవరకు ప్రభుత్వం నుంచి, ఎలాంటి స్పందన రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగులు /లెక్చరర్లు తీవ్రమానసిక ఆవేదన గురవుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి పత్రం ఆన్లైన్ ద్వారా తెలియజేయడం జరిగింది అని కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, మంత్రులు హరీష్ రావు, ,శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి, చీఫ్ సెక్రటరీ, ఆర్థిక, విద్యాశాఖ, వైద్య& ఆరోగ్య శాఖ కార్యదర్శులకు ఈరోజు ఆన్లైన్ ద్వారా తమ సాధన సమితి నుంచి వినతి పత్రాలు పంపించడం జరిగిందని తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్గదర్శకాలు జారీ చేసి కాంట్రాక్టు ఉద్యోగులకు/ లెక్చరర్లకు ధైర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు

Follow Us @