హైదరాబాద్ (ఫిబ్రవరి – 03) : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో కాంట్రాక్టు ఉద్యోగులకు “కాంట్రాక్టు ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతుంది” అని ప్రసంగించడాన్ని ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ జీవో నెంబర్ 16 కాంట్రాక్టు ఉద్యోగుల& లెక్చరర్ల క్రమబద్ధీకరణ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, కో కన్వీనర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల బాధలను చూసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కే. చంద్రశేఖర రావు గారు మానవతా దృక్పథంతో క్రమబద్ధీకరణకు జీవో నెంబర్ 16 2016లో జారీ చేసినప్పటికీ ఇంతవరకు వైద్య ఆరోగ్య శాఖలోని మరియు విద్యా శాఖలో మెజార్టీగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లు ఏ ఒక్కరు కూడా క్రమబద్ధీకరణ జరగలేదని తెలిపారు. ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కే. చంద్రశేఖర రావు గారు గత అసెంబ్లీ సమావేశంలోనే క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన నివేదికలో 11,103 మంది ఉద్యోగులు క్రమదీకరించినట్లు తెలిపారు. కానీ ఇంతవరకు దీని సంబంధించిన ఉత్తర్వులు రాకపోవడం వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు & లెక్చరర్ లు తీవ్ర మానసిక ఆవేదన చెందుతున్నారని, క్రమబద్ధీకరణ ఉత్తర్వులు గురించి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర రావు గారు జోక్యం చేసుకొని వెంటనే క్రమబద్ధీకన ఉత్తర్వులు జారీ చేసి దేశవ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగుల వెట్టి చాకిరీ రూపుమాపటానికి మార్గం చూపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, కో కన్వీనర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు.
Follow Us @