నవీన్ మిట్టల్ ను కొనసాగించాలంటూ ప్లకార్డుల ప్రదర్శన

హైదరాబాద్ (ఫిబ్రవరి – 03) : తెలంగాణ ఇంటర్మీడియట్ కమిషనర్ (FAC) గా నవీన్ మిట్టల్ ను కొనసాగించాలని TIGLA, TIPS 475 సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భోజన విరామ సమయంలో ప్లకార్డుల ప్రదర్శనను నిర్వహించారు.

ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్, జంగయ్య, కొప్పిశెట్టి సురేష్ లు మాట్లాడుతూ ఇంటర్ విద్యా కమిషనర్ గా నవీన్ మిట్టల్ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని… ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు నవీన్ మిట్టలను కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల శ్రీరంగపురంలో ప్రదర్శన :

నవీన్ మిట్టల్ గారిని ఇంటర్మీడియట్ కమిషనర్ & కార్యదర్శి ( FAC ) గా కొనసాగించాలని ఈ రోజు భోజన విరామ సమయంలో వినతిపత్రాన్ని ప్రిన్సిపాల్ కు సమర్పించడం జరిగిందని జె.కురుమూర్తి 475 సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జె.కురుమూర్తి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఎం శ్రీనివాస్, ఎం శ్రీనివాసులు, కృష్ణమూర్తి ,సదయ్య శ్రీధర్, వెంకటకృష్ణ, ఆశాజ్యోతి, శ్రీదేవి పాల్గొన్నారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @