పిబ్రవరి ఒకటి నుండి డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభం – నవీన్ మిట్టల్

కరోనా నేపథ్యంలో వాయిదా పడిన విద్యాసంస్థలను ఈ విద్యా సంవత్సరానికి గాను 9వ తరగతి పైబడిన తరగతులను ఫిబ్రవరి 1 నుండి పునః ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో డిగ్రీ కళాశాలలు మరియు పీజీ కళాశాలను ఫిబ్రవరి 1 – 2021 నుండి ప్రారంభించాలని కాలేజీయోట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు.

కోవిడ్ – 19 నిబంధనలను, తెలంగాణ ప్రభుత్వం మరియు యూజీసీ విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తూ కళాశాలలను నిర్వహించాలని ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.

Follow Us@