సెప్టెంబర్ ఒకటి నుంచి డిగ్రీ భౌతిక తరగతులు

  • పూర్తి స్థాయిలో సిబ్బంది హజరు కావాలి.

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలో సెప్టెంబర్ ఒకటి నుండి పూర్తిస్థాయిలో భౌతిక తరగతులు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు సెప్టెంబర్ ఒకటి నుండి భౌతిక తరగతులు నిర్వహించడానికి కాలేజీయోట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

కోవిడ్ నిబంధనలు సక్రమంగా పాటిస్తూ సెప్టెంబర్ 1 నుండి డిగ్రీ భౌతిక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే పూర్తి స్థాయిలో సిబ్బంది కళాశాలలకు హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.