బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం

డిగ్రీ లెక్చరర్ల బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఆమోదం లేకుండా విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు ఎలా చేస్తారని ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు సమాచారం.

ఈ బదిలీల వ్యవహారంపై మంత్రి సమగ్రంగా సమీక్షించే అవకాశం ఉంది. ఈ బదిలీల వ్యవహారంపై ఉన్నతాధికారులు కూడా స్పందించి. ఇప్పటికే బదిలీలు పొందిన లెక్చరర్లను రిలీవ్‌ చేయవద్దని ఆదేశాలు జారీచేశారు.

అయితే అప్పటికే బదిలీ పొందిన లెక్చరర్లంతా కొత్త స్థానాల్లో చేరిపోయారు. దీంతో బదిలీ స్థానాల్లో చేరిన తర్వాత నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని మరి కొంతమంది లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు.

Follow Us@