త్వరలో 738 డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ ల పోస్టుల భర్తీ

  • డీఎల్ 491, సాంకేతిక విద్యలో 247 ఖాళీలు
  • టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ.. వివరాలను అందజేసిన అధికారులు

హైదరాబాద్ (సెప్టెంబర్ 26) : తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ జారీచేయనున్నది. డిగ్రీ లెక్చరర్ 491, సాంకేతిక విద్యలో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నియమ నిబంధనలతో కూడిన వివరాలను అధికారులు టీఎస్పీఎస్సీకి ఇటీవలే అందజేశారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఆర్థిక శాఖ వేర్వేరుగా రెండు జీవోలను జారీ చేసింది.

రాష్ట్రంలో మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,098 పోస్టులుండగా, 1,255 రెగ్యులర్, 812 కాంట్రాక్ట్, 1,940 గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. రెగ్యులర్ పోస్టులను 2012లో భర్తీచేశారు. తాజాగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినివ్వడంతో లెక్చరర్ల కొరత తీరనున్నది. ఇటీవలి కాలంలో పలు కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంసెట్ లో సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ కోర్సును ఎంచుకొంటున్నారు. ఈ కోర్సును 129 కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. కానీ బోధించేందుకు 50 మంది లెక్చరర్స్ మాత్రమే ఉన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన పలు కోర్సులు, సబ్జెక్టుల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. కాగా, డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు నెట్, సెట్ లేదా పీహెచ్డీ అర్హతను తప్పనిసరి .

◆ ఎంటెక్ పూర్తిచేస్తే కొత్త పేస్కేల్..

రాష్ట్రంలో 54 పాలిటెక్నిక్ కాలేజీల్లో 3,647 పోస్టులున్నాయి. 1100 పైచిలుకు రెగ్యులర్ లెక్చరర్ లు కాగా, కాంట్రాక్ట్ పద్ధతిలో 405 లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఈ కాలేజీల్లో 247 పోస్టుల భర్తీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ పోస్టుల్లో ఎంటెక్ అర్హత ఉన్న వారికి కొత్త పేస్కేల్ను వర్తింపజేస్తున్నారు. బీటెక్ పూర్తిచేసిన వారికి ప్రారంభవేతనం రూ.56,100, ఎంటెక్ చదివిన వారికి రూ. 57,700 చెల్లించనున్నారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ డీఎల్ పోస్టులివే..

కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లయిన్సెస్ 311, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ 39, ఇంగ్లిష్ 23, తెలుగు 27, సంస్కృతం 23, డాటా సైన్స్ 12 సహా మరికొన్ని కలిపి 491 పోస్టులున్నాయి.

◆ సాంకేతిక విద్యాశాఖలో

సివిల్ ఇంజినీరింగ్ 82, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 24, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 41, మెకానికల్ 36, ఆటోమొబైల్ 15తో పాటు మరి కొన్ని కలిపి 247 పోస్టులున్నాయి.

credits : ntnews

Follow Us @