- డిగ్రీలో ఇప్పటివరకు 2.28లక్షల సీట్లు భర్తీ
హైదరాబాద్ (సెప్టెంబర్ 17) : తెలంగాణ లోని డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది మొత్తం 4.20 లక్షల సీట్లకుగాను కేవలం 2.28 లక్షల సీట్లు భర్తీ అయ్యాయి. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడత సీట్ల కేటాయింపును అధికారులు శుక్రవారం పూర్తిచేశారు.
మూడో విడతలో 71,600 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, వారిలో 66, 526 మంది విద్యార్థులు సీట్లు దక్కించు కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు దోస్త్ పోర్టల్లో లాగిన్ అయి ఫీజు చెల్లించి సీటు దక్కించుకోవాలని అధికారులు సూచించారు.
సెప్టెంబర్ 22లోపు విద్యార్థులంతా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సూచించారు. అక్టోబర్ మొదటి వారంలో డిగ్రీ ఫస్టియర్ క్లాసులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.