17న తెలంగాణ డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ ల ఆత్మీయ సమ్మళనం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రత సాధన మరియు తక్షణమే పరిష్కారించాల్సిన సమస్యల పై చర్చించడం కోసం హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్ భవన్ లో జనవరి – 17 – 2021 న తెలంగాణ డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ ల ఆత్మీయ సమ్మళనం కార్యక్రమం జరుపుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్. వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఖాదర్ వలీ తెలిపారు.

గత 20 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దాదాపు 825 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు సమస్యలపై చర్చించడానికి మరియు ఉద్యోగ భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ఈ సమావేశంలో తక్షణమే పరిష్కరించాల్సిన అంశాలుగా

  • నెల నెల వేతనం,
  • క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం,
  • రెగ్యులర్ ఉద్యోగులతో పాటే పీఆర్సీ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లను పరిష్కరించడం కోసం భవిష్యత్ కార్యచరణ ఈ సమావేశంలో ప్రకటించినున్నారు.

కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై విజయవంతం చేయాలని అధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఖాదర్ వలీ‌, వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, అసోసియేట్ ప్రెసిడెంట్ అరుణ, వినయ్ కుమార్, మహేష్ రాష్ట్ర నాయకులు రామన్ గౌడ్, త్రిభువనేశ్వర్, కాంతయ్య, శ్రీకాంత్,
బాలరాజు, నాగరాజు, రేష్మ తదితరులు పిలుపునిచ్చారు.

Follow Us@