డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను ఎమ్మెల్సీ పల్లా దృష్టికి తీసుకువెళ్లిన వినోద్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్ పే కల్పించినందుకు కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ తరపున ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి అధ్యక్షుడు వినోద్ కుమార్ బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు.

ఈ సందర్భంగా డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల వివిధ సమస్యలు గురించి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా

  • 2021 – 22 విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేయుట
  • హిందీ లెక్చరర్ లను రిటెన్సన్ చేయుట
  • B.com జనరల్, B.Sc కోర్సుల యందు తెలుగు మీడియం ప్రవేశపెట్టుట గురించి.
  • డిస్ట్రబ్ అయినా కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ లను తిరిగి విధులలోకీ తీసుకోనుట గురించి వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పై సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, ప్రభుత్వం ఎల్లవేళలా కాంట్రాక్టు లెక్చరర్లకు అండగా ఉంటుందని వెంటనే సానుకూలంగా స్పందించి వివిధ అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యల పరిష్కారం కొరకు చొరవ చూపిన MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.

ఈ రోజు కలిసిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్ , రాష్ట్ర నాయకులు మహేశ్ కుమార్, కవిత, బాలరాజు, ఖాదరవల్లి పాల్గొన్నారు.