కాంట్రాక్ట్ డిగ్రీ అధ్యాపకులకు వేతనాలకై ప్రోసిడింగ్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న 817 మంది కాంట్రాక్టు డిగ్రీ అధ్యాపకులకు గత సంవత్సరం బకాయిలు ఉన్న వేతనాలు మరియు ప్రస్తుత సంవత్సరం (2020 – 21) వేతనాలకు సంబంధించి కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ వేతనాల విడుదల చేస.తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో గత సంవత్సరం ప్రీజింగ్ ఇతర సమస్యల వలన ఇతర కారణాల వల్ల వేతనాలు రాని అధ్యాపకులకు ఇప్పుడు వేతనం రానుంది.

అలాగే కరోనా కారణంగా సెప్టెంబర్ – 1 నుండి 50% హజరు మినహాయింపు ఉన్న నేపథ్యంలో పూర్తి వేతనాన్ని సంబంధించిన నెలలకు చెల్లించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాంట్రాక్టు డిగ్రీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ లు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కి, కమీషనర్ నవీన్ మిట్టల్ కి ధన్యవాదాలు తెలిపారు.

Follow Us @