డిగ్రీ ‘కాంట్రాక్టు’లో అదనపు అర్హత కలవరం

eenadu courtesy

  • నెట్, స్లెట్, పీహెచ్ డీ ఉండాలన్న నిబంధన!
  • అయిదేళ్ల సమయం ఇవ్వాలంటున్న అధ్యాపకులు

హైదరాబాద్ (జూలై – 08): తమ ఉద్యోగాలను క్రమబ ద్ధీకరిస్తారని ఆశతో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పని చేసే కాంట్రాక్టు అధ్యాపకుల్లో కొత్త కలవరం మొదలైంది. పీజీతోపాటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు(నెట్), స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్టు(స్లెట్)లో అర్హత సాధించి ఉండాలని లేదా పీహెచీ పూర్తి చేసి ఉండాలన్న నిబం ధన విధిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు ఆ అర్హతలు ఉన్న 288 మంది పేర్లను ఉన్నత విద్యాశాఖకు పంపినట్లు తెలుస్తోంది. మొత్తం 129 కళాశాలల్లో 811 మంది కిపైగా కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వారిలో 288కి తప్ప మిగిలిన 523 మందికి కేవలం పీజీ విద్యార్హత మాత్రమే ఉంది. ఇప్పుడు అదనపు అర్హత తప్పని సరిగా ఉండాలని భావించి కొందరి జాబితాను పంపిస్తుండటంతో మిగిలిన వారు తీవ్ర ఆందోళనకు గురవతున్నారు.

అదనపు అర్హతను 2009లో నోటిఫై చేసి 2011లో తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో 2010లో జూనియర్ అధ్యాపకులకు జీఓ 128 ద్వారా డిగ్రీ అధ్యాపలుగా పదోన్నతి కల్పించారు. వారికి ఆనాడు అదనపు అర్హతలు లేవు. అయిదు సంవత్సరాలలోపు అర్హ పొందేలా షరతు విధించారు. అది సాధించని వారు రాష్ట్ర వేతనం ఇచ్చారు. 2018లో మిర్యాలగూడలో కేఎన్ఎం ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మార్చినప్పుడు కూడా 30 మంది అధ్యాపకులను పీజీ అర్హతతోనే క్రమబద్ధీకరించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి అదనపు అర్హత కోసం అయిదే సమయం ఇవ్వాలని అధ్యాపకులు మంత్రులు, అధికారులకు విన్నవించారు. దీనిపై ప్రభుత్వం జీఓ ఇచ్చి న్యాయం చేయాలని డిగ్రీ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల రాష్ట్ర నాయకుడు జి. మధుసూదన్ రెడ్డి కోరారు.

Follow Us @