న్యూఢిల్లీ (డిసెంబర్ 19) : డిగ్రీ పుస్తకాలను 12 భారతీయ ప్రాంతీయ భాషల్లో తీసుకొచ్చే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కసరత్తు చేస్తున్నది.
విద్యార్థులు మాతృభాషలో డిగ్రీ చేసేలా బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు తదితర భాషల్లో పుస్తకాలను రూపొందిస్తున్నది.
యూజీసీ సూచనలతో పలు పబ్లికేషన్ సంస్థలు అనువాద పుస్తకాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి