ప్రభుత్వ డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలకు సెలవు ప్రకటించాలి – 475 సంఘం విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు వెంటనే సెలవులు ప్రకటించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్అసోసియేషన్ రాష్ట్రఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


ప్రస్తుత covid-19 సెకండ్ వేవ్ ప్రభావంతో స్కూలకు మరియు జూనియర్ కాలేజ్ కు ఈరోజు నుండి సెలవు ప్రకటించడం జరిగిందని, కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లకు ఇంతవరకూ సెలవులు ప్రకటించక పోవడం వలన, అందులో పనిచేస్తున్న సిబ్బంది అధ్యాపకులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.

ఖమ్మం, సిద్దిపేట గజ్వేల్, హైదరాబాద్ సిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బయోమెట్రిక్ హాజరు వల్ల అక్కడ అధ్యాపకులు కరోనాకు గురయ్యారని, ఈ విషయం పై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు, ఉన్నత విద్యాశాఖ అధికారులు, కళాశాలలో పనిచేసే సిబ్బంది& అధ్యాపకుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు మరియు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు హాలిడేస్ ప్రకటించాలని , అవసరమైతే వర్క్ ఫ్రం హోం ప్రకారం విధులు నిర్వహించే అవకాశం కల్పించాలని, ఈరోజు విద్యాశాఖ మంత్రి గారికి మరియు ఉన్నత విద్యా శాఖ అధికారులకు మరియు కాలేజ్ కమిషనర్ &టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కు వినతిపత్రం పంపించినట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాంపల్లి శంకర్, వైకుంఠం, ప్రవీణ్, దేవేందర్ ఉదయశ్రీ , మధుకర్, డాక్టర్. వస్కుల. శ్రీనివాస్, శోభన్ బాబు, సయ్యద్ జబీ ఉల్లా తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

Follow Us@