ముంబై (సెప్టెంబర్ – 27) : డీమ్యాట్ ఖాతాదారులు తమ ఖాతాలకు నామినీ వివరాలను అందించేందుకు గడువును డిసెంబరు 31 వరకు పెంచుతూ సెబీ నిర్ణయం తీసుకుంది. Demat account nominee
సెప్టెంబర్ 30 తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో పలు వర్గాల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు గడువును పొడిగించినట్లు సెబీ తెలిపింది.
డిక్లరేషన్ ఫారం ద్వారా నామినేషన్ వివరాలు అందించడం లేదా నామినేషన్ కు దూరంగా ఉండే సౌలభ్యం ప్రస్తుత డీమ్యాట్ ఖాతాదారులకు ఉంది. ట్రేడింగ్ ఖాతాలకూ స్వచ్ఛందంగా నామినేషన్ సమర్పించే సదుపాయాన్ని కల్పిస్తోంది.
డిక్లరేషన్ లేదా పాన్ కార్డ్ కలిగి ఉన్న నామిని వివరాలు అప్డేట్ చేయకపోతే డిమాట్ మరియు ట్రేడింగ్ ఖాతాలనం సెబీ బ్లాక్ లో పెట్టనుంది.