DCvsCSK : ప్లేఆఫ్స్ కి చేరిన చెన్నై సూపర్ కింగ్స్

న్యూడిల్లీ (మే – 20) : చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ కి చేరింది. ఢిల్లీ జట్టు ఇప్పటికే ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే. గుజరాత్ తర్వాత ప్లే ఆప్స్ కి చేరిన రెండో జట్టుగా చెన్నై నిలిచింది.

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (79), కాన్వే (87) పరుగులతో రాణించడంతో మూడు వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు కకెప్టెన్ డేవిడ్ వార్నర్ (86) మినహా మిగతా బ్యాట్స్ మెన్లు పెద్దగా రాణించకపోవడంతో ఓటమి పాలయింది.