DASRA HOLIDAYS – ఏపీ, తెలంగాణలలో దసరా సెలవులు

BIKKI NEWS (OCT. 01) : DASARA HOLIDAYS IN AP and TELANGANA. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఇరు రాష్ట్రాల విద్యాశాఖలు ప్రకటనలు వెలువరించాయి.

DASARA HOLIDAYS IN AP and TELANGANA

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సాధారణ సెలవు దినం కావడంతో అక్టోబర్ 2 నుండి సెలవులు ఇచ్చినట్లు అయింది.

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు అక్టోబర్ 2 నుండి 14 వరకు దసరా సెలవులను ప్రకటించారు. అయితే ఇంటర్మీడియట్ విద్యాసంస్థలకు మాత్రం అక్టోబర్ 6 నుండి 13 వరకు మాత్రమే దసరా సెలవులను ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు అక్టోబర్ 14న తెరుచుకోనుండగా, తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 15న పాఠశాలలు, అక్టోబర్ 14న జూనియర్ కళాశాలలు తెలుసుకోనున్నాయి.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు