దసరా సెలవులు అక్టోబర్ 13 నుండి 17 వరకు

ఇంటర్మీడియట్ తరగతులకు 2021-22 విద్యా సంవత్సరానికి గాను మొదటి టర్మ్ సెలవులు అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 17 వరకు ఇస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

ఈ సమయంలో విద్యార్థులకు ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ అందరికి ఆజ్ఞాపించారు. సూచనల ఉల్లంఘిస్తే మేనేజ్‌మెంట్‌లు, ప్రిన్సిపాల్స్‌పై తగిన చర్య తీసుకుంటామని తెలిపారు

పై సెలవుల తరువాత, కళాశాలలు 18.10.2021 న తిరిగి పునఃప్రారంభం కానున్నాయి.