మబ్బు పరశురాం కు దళిత రత్న అవార్డ్

భారతరత్న , భారత రాజ్యాంగ నిర్మాత డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవము 2022 పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి డా॥ యోగిత రానా (IAS) కమీషనర్ ,ఎస్సీ అభివృద్ది శాఖ చేతుల మీదుగా దళిత రత్న అవార్డును జనగాం, లింగాల ఘణపురం, కళ్ళెం గ్రామవాసి అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన సలహాదారులు, మాదిగ ఆలోచన వేదిక వ్యవస్థాపకులు, కరెన్సీ నోట్ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధికార ప్రతినిధి మబ్బు పరశురాం మాదిగ అందుకోవడం జరిగింది.

పరశురాం విద్యావేత్త, సమ సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేయడం, అనేక సభల ద్వారా అంబేద్కర్, ఫూలే మరియు కాన్షీరాం ల ఆలోచన విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లడం వంటి సమాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు, మలి దశ తెలంగాణ ఉద్యమం ఉస్మానియ యూనివర్సిటీ లో జాక్ కన్వీనర్ గా క్రియాశీలక పాత్ర పోషించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అత్యంత ప్రతిష్టాత్మకమైన దళిత రత్న అవార్డుచే సత్కరించింది.

ఈ కార్యక్రమంలో వర్కింగ్ ఛైర్మన్ బాబు మాదిగ, రావుల విజయ్ కుమార్ ,IAS శ్రీ రాహుల్ బొజ్జ (కార్యదర్శి,ఎస్సీ అభివృద్ది శాఖ),CAPPS జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us @