AP NEWS : ఎస్సీలుగా దళిత క్రైస్తవులు.. ఎస్టీల్లోకి బోయలు, వాల్మీకిలు

  • ఆమోదానికి కేంద్రాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం

విజయవాడ (మార్చి – 25) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని.. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల జాబితాలో చేర్చాలని శాసనసభ చేసిన రెండు వేర్వేరు తీర్మానాల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.

మతం మారినంత మాత్రాన వారి ఆర్థిక స్థితిగతులలో మార్పు ఉండదని గుర్తు చేస్తూ అన్యాయానికి గురైన వారికి చేతనైనంత మంచి చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ బాధ్యత తీసుకోవాలనే ఈ రెండు తీర్మానాలు చేశామని వివరించారు.