21 జూలై 2022 కరెంట్ అఫైర్స్ Q.A.

1) అంతర్జాతీయ న్యాయ దినోత్సవం 2022 ఇటీవల ఎప్పుడు జరుపుకుంటారు?
జ – జూలై 17

2) కాలుష్యాన్ని అరికట్టడానికి భారతదేశపు మొట్టమొదటి ‘ఈ-వేస్ట్ ఎకో పార్క్’ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది?
జ – ఢిల్లీ

3) నేషనల్ వాటర్‌షెడ్ కాన్ఫరెన్స్ 2022 ఎక్కడ నిర్వహించబడింది?
జ – న్యూఢిల్లీ

4) సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘ధమక్కా దివస్ 2022 వేడుకలను’ ఏ నగరంలో నిర్వహించింది?
జ – సారనాథ్

5) వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన ‘లింగ వ్యత్యాస నివేదిక 2022’లో భారతదేశం ర్యాంక్ ఎంత?
జ – 135 వ స్థానం

6) ఇటీవల మరణించిన భారతదేశంలో ఇంటర్నెట్ విప్లవ పితామహుడిగా ఎవరు పరిగణించబడ్డారు?
జ – బ్రిజేంద్ర కుమార్ సింఘాల్

7) భారత 15 వ రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ద్రౌపది ముర్ము

8) రాష్ట్రపతిగా ఎన్నికయిన ద్రౌపది ముర్ముది ఏ గ్రామం.?
జ : రాయరంగాపూర్ (ఒడిశా)

9) జాతీయ క్రీడల్లో కొత్తగా ఏ క్రీడాంశాలను ప్రవేశపెట్టారు.?
జ : యోగా, మల్ కాంబ్

10) ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ – 2021 లో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 3వ స్థానం (మొదటి స్థానంలో కర్ణాటక)

11) తెలంగాణ లో 1800 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఫార్మా సంస్థ ఏది.?
జ : బయాలాజికల్ ఈ

12) తెలంగాణ ప్రభుత్వం తన పథకాలు ఏ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడానికి ఒప్పందం కుదిరించుకుంది.?
జ : కూ యాప్

13) తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాల కల్పనకై ఒప్పందం చేసుకున్న సంస్థ ఏది.?
జ : ఎల్ & టీ మెట్రో రైలు హైదరాబాద్ సంస్థ

14) తాజాగా రాజీనామా చేసిన ఇటలీ ప్రధాని ఎవరు.?
జ : మారియో డ్రాఘీ

15) 600 కోట్ల ఆస్తిని యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి పేదలకు సేవల కోసం రాసిచ్చిన వ్యాపార వేత్త ఎవరు.?
జ : డాక్టర్‌ అర్వింద్‌ గోయల్‌

16) ఏ కేసు విషయంలో ఈడీ సోనియా గాంధీని విచారించింది.?
జ : నేషనల్ హెరాల్డ్ కేసు

17) దక్షిణకొరియాలోని చాంగ్వాన్ లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్‌ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ను భారత్‌ ఏ స్థానంలో నిలిచింది.?
జ : అగ్రస్థానంలో

18) కామన్వెల్త్‌ క్రీడలకు వెళ్లిన క్రీడాకారులలో డోపింగ్ టెస్టులో దొరికినది ఎవరు.?
జ : స్ప్రింటర్‌ ఎస్‌. ధనలక్ష్మి, ట్రిపుల్‌ జంపర్‌ ఐశ్వర్య బాబు

19) అమృత్ సరోవర్ కార్యక్రమంలో మొదటి మూడు స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
జ : మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్

20) బొమ్మల తయారీ యూనిట్ల ఏర్పాటుకు వీలుగా ‘టాయ్స్‌ పార్క్‌’ను ఎక్కడ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.?
జ : దండుమల్కాపూర్‌లో (భువనగిరి జిల్లా)