1) భారతదేశం-ఆఫ్రికా వృద్ధి భాగస్వామ్యంపై 17వ CII EXIM కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది.?
జ : న్యూ ఢిల్లీ
2) న్యూ ఢిల్లీలో జరిగిన 17వ CII EXIM కాన్క్లేవ్ సందర్భంగా పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారం కోసం NTPC ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : మాసెన్ (మొరాకో ఏజెన్సీ ఫర్ సస్టెయినబుల్ ఎనర్జీ)
3) భారతదేశం COVID-19కి వ్యతిరేకంగా 200 కోట్ల టీకాల మైలురాయిని ఎన్ని నెలల్లో దాటింది.?
జ : 18 నెలల్లో
4) తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎవరితోతో కలిసి డిజిటల్ పబ్లిక్ గూడ్స్ అలయన్స్‌లో భాగంగా “డేటా ఇన్ క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్ (DiCRA)” ను ప్రకటించింది.?
జ : యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP)
5) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ తదుపరి MD & CEO గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : ఆశిష్ కుమార్ చౌహాన్
6) దేశంలోని మొట్టమొదటి 5G ప్రైవేట్ నెట్‌వర్క్‌ను బెంగళూరు లో ఉన్న Bosch ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ లో ఏ సంస్థ పరీక్షించింది.?
జ : భారతి ఎయిర్‌టెల్
7) 2025 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ ఏ దేశాన్ని ఎంపిక చేసింది.?
జ : టోక్యో (జపాన్)
8) ISSF ప్రపంచ కప్‌లో పురుషుల స్కీట్ బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి వ్యక్తిగా నిలచిన భారతీయ షూటర్ ఎవరు.?
జ : మైరాజ్ అహ్మద్ ఖాన్
9) శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : రణిల్ విక్రమసింఘే
10) చిరుత పున:ప్రవేశం కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
జ : నమీబియాతో
11) భారతదేశం ఏ దేశంతో న్యాయ సహకార రంగంలో అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
జ : రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ జ్యుడీషియల్ సర్వీస్ కమిషన్ తో
12) రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ లో బాగంగా డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ
13) ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో ట్రిపుల్ జంప్‌లో వరుసగా మూడోసారి స్వర్ణ పథకం విజేత ఎవరు.?
జ : యులిమర్ రోజస్
14) దక్షిణాఫ్రికా టీట్వంటీ లీగ్ కమీషనర్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : గ్రేమ్ స్మిత్
15) డాక్టర్ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి 2023 గాను ఎవరు ఎంపికయ్యారు.?
జ : ప్రతిభారాయ్ (ఒడిశా)
16) ఆగస్టు 15 సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటి.?
జ : ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం.
17) అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్‌లో స్వర్ణ పథకం విజేత ఎవరు.?
జ : ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్
18) ఏ పోర్టు పనులకు ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.?.
జ : రామాయపట్నం పోర్టు