24 జూలై 2022 కరెంట్ అఫైర్స్ Q.A

1) శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : దినేష్ గుణవర్దన

2) ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్) ఎవరిని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది.?
జ : సీఫ్ అహ్మద్‌ (ఈజిప్ట్‌)

3) ప్రతి సంవత్సరం ఎప్పుడు జాతీయ ప్రసార దినోత్సవం జరుపుకుంటారు.?
జ : జూలై 23

4)మొదటి ఖేలో ఇండియా ఫెన్సింగ్ ఉమెన్స్ లీగ్ 25 జూలై 2022 నుండి ఎక్కడ ప్రారంభమవుతుంది.?
జ : టాల్కటోరా ఇండోర్ స్టేడియం, (న్యూఢిల్లీ)

5) BCCI అంపైర్ల కోసం కొత్త A+ కేటగిరీని పరిచయం చేసింది. A+ మరియు A కేటగిరీలలోని అంపైర్‌లకు ఫస్ట్-క్లాస్ గేమ్‌కు రోజుకు ఎంత చెల్లిస్తారు.?
జ : 40 వేలు (B & C కేటగిరీ అంపైర్లకు రోజుకు రూ.30 వేలు)

6) ప్రస్తుతం ఐసిసి ఎలైట్ ప్యానెల్‌లో 9 మంది అంపైర్ లతో పాటు A+ కేటగిరీలో ఏకైక భారతీయుడు ఎవరు.?
జ : నితిన్ మీనన్‌కు

7) భారతదేశపు మొట్టమొదటి ప్యాసింజర్ డ్రోన్ ను న్యూఢిల్లీలో ప్రధాని మోదీ ఆవిష్కరించారు. దాని పేరు ఏమిటి.?
జ : వరుణ

8) వరుణను ఏ స్టార్టప్ ఇండియన్ నేవీ కోసం అభివృద్ధి చేసింది.?
జ : ‘సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్’

9) ‘డిజివాణి’ కాల్ సెంటర్లను ప్రారంభించేందుకు నాస్కామ్ ఏ సంస్థతో టై-అప్ అయింది.?
జ : గూగుల్

10) ఆయకార్ దివాస్ లేదా ఆదాయపు పన్ను దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు.?
జ : జూలై 24

11) రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోల్‌కతాలో 4వ PIA స్టెల్త్ ఫ్రిగేట్ ని ప్రారంభించారు. దాని పేరు ఏమిటి.?
జ : డుంగిని

12) ఏ భారతీయ నటుడుకి యూఏఈ దేశం గోల్డెన్ వీసా ప్రదానం చేసింది.?
జ : కమలహాసన్

13) FICCI తాజా అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 7.0%

14) తాజాగా భారత్ ఏ దేశంతో “సమగ్ర సరిహద్దు నిర్వహణ ప్రణాళిక” ఒప్పందం చేసుకుంది.?
జ : బంగ్లాదేశ్

15) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ షిప్ -2022 ఎక్కడ నిర్వహించారు.?
జ : ఓరేగాన్ (అమెరికా)

16) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ షిప్ -2022 సిల్వర్ మెడల్ సాధించిన భారతీయ క్రీడాకారుడు ఎవరు.?
జ : నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో)

17) ఇటీవల మరణించిన సుబాష్ పత్రిజీ ఏ సంస్థ ను స్థాపించాడు.?
జ : ది పిరమిడల్ స్పిరిచ్వల్ సోసైటీ

18) ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధను శ్రీకారం చుట్టిన రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్

19) 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలో 5 అవార్డులను గెలిచిన చిత్రం ఏది.?
జ : సురారై పోట్రు

20) ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్ని వారాల వరకు అబార్షన్ కు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.?
జ : 24 వారాలు

Follow Us @