1) తెలంగాణలో ముల్కనూరు ఆదర్శ గ్రామానికి దేనితో సంబంధం కలదు.?
జ : సహకార బ్యాంకింగ్
2) తెలంగాణలో భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు.?
జ: వినోబా భావే
3) మహబూబ్ నగర్ జిల్లాగా ఏర్పడక ముందు ఏ పట్టణం జిల్లా కేంద్రంగా ఉండేది.?
జ : నాగర్ కర్నూలు
4) తెలంగాణలో అతి ప్రాచీన ఆనకట్ట ఏది ?
జ : జూరాల
5) తారామతి బారాదరి తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఉంది.?
జ : గోల్కొండ – హైదరాబాద్
6) తెలంగాణలో మొదటి దళిత వార్తాపత్రిక పేరు ఏమిటి?
జ : పంచమా
7) హైదరాబాదులో నిజాం నిర్మించిన థియేటర్ పేరు ఏమిటి?
జ : సెలెక్ట్ టాకీస్
8) హుస్సేన్ సాగర్ జలాశయంలో ప్రతిష్టించిన ప్రఖ్యాత గౌతమ బుద్ధుని విగ్రహ వాస్తు శిల్ఫి ఎవరు?
జ : గణపతి స్తపతి
9) నిర్మల్ బొమ్మల తయారీ కొరకు ఉపయోగించే కర్ర ఏది ?
జ : పునికి కర్ర
10) జిహెచ్ఎంసి ఎప్పుడు ఏర్పాటు అయింది.?
జ : 2007
11) డాక్టర్ కె. జయశంకర్ ప్రిన్సిపాల్ గా పని చేసిన డిగ్రీ కళాశాల ఏది.?
జ : సికేఎం కళాశాల
12) తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ గల కేంద్రం.?
జ : దూలపల్లి
13) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం ఎంత.?
జ : 9.5%
14) తెలంగాణలో ఎక్కువగా కనిపించే గిరిజన తెగ ఏది.?
జ : లంబాడీలు
15) తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత చత్తీస్ ఘడ్ రాష్ట్రం తో సరిహద్దు కలిగిన జిల్లా ఏది.?
జ : భద్రాద్రి, కొత్తగూడెం