DAILY GK BITS IN TELUGU 11th AUGUST

DAILY GK BITS IN TELUGU 11th AUGUST

1) హైదరాబాద్‌ రాజ్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన దేశం?
జ : సిరియా

2) 1958లో తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు?
జ : కె.అచ్యుతారెడ్డి

3) పారిశ్రామికంగా ఉత్పత్తి చేసిన ఏ ఎంజైమ్‌ను పెరుగు తయారీలో వాడుతారు?
జ : రెనిన్‌

4) క్లోనింగ్‌ ప్రక్రియలో క్లోన్‌ అనే పదానికి అర్థం ఏమిటి?
జ : ఒకే జాతి జీవుల సముదాయం

5) ప్రకృతిలో సహజ క్లోనింగ్‌ వేటిలో జరుగుతుంది?
జ : శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకొనే మొక్కలు

6) ఒక కణం నుంచి పూర్తి జీవి తయారయ్యే విధానం?
జ : క్లోనింగ్‌

7) మాలిక్యులార్‌ కత్తెరలు లేదా అణుకత్తెరలు అని వేటిని పిలుస్తారు?
జ : రెస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌లు

8) బీటీ పత్తి రకంలో బి, టి అంటే ఏమిటి?
జ : బాసిల్లస్‌ తురింజియెన్సిస్‌

9) వైద్య రంగానికి సంబంధించి బయోటెక్నాజి ఒక.?
జ : రెడ్‌ బయోటెక్నాలజీ

10) డార్క్‌ బయోటెక్నాలజీ దేనికి సంబంధించింది?
జ : బయో టెర్రరిజం, జీవ ఆయుధాలు, పారిశ్రామిక జీవశాస్త్ర సాంకేతికత

11) హ్యూమన్‌ జీనోమ్‌ ప్రాజెక్ట్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జ : 1990

12) మొదటి ట్రాన్స్‌జెనిక్‌ పంట ఏది?
జ : మొక్కజొన్న