BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU OCTOBER 1st
DAILY GK BITS IN TELUGU OCTOBER 1st
1) జాతీయ విపత్తు తగ్గింపు దినము ఏది?
జ : అక్టోబర్ 29
2) ఏ రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగం అత్యవసర పరిస్థితి నిబంధనను స్వీకరించింది.?
జ : జర్మనీ
3) రాజ్యాంగానికి సవరణ చేయగల విధానం అనేది ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడినది.?
జ : దక్షిణ ఆఫ్రికా
4) టీ హబ్ మొదటి దశకు పెట్టిన పేరు.?
జ : కేటాలిస్ట్
5) సద్ది మూట పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఎవరి కోసం ఐదు రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించింది.?
జ : రైతులు
6) ఫిబ్రవరి 1925 లో మొదటి గ్రంథాలయ మహాసభ జరిగిన ప్రాంతం ఏది .?
జ : మధిర
7) హైదరాబాదులో సాలార్జంగ్ మ్యూజియం ని స్థాపించినది ఎవరు?
జ : మూడో సాలార్ జంగ్
8) యాపిల్ లోని కోసి ఉన్న భాగం గాలిలో ఉంచినప్పుడు గోధుమ రంగులోకి మాటానికి కారణమేమిటి.?
జ: ఆపిల్ లోని ఎంజైమ్ ఆక్సికరణం చెందడం
9) ఆమ్ల వర్షాలలో ఎక్కువగా కురిసే ఆమ్లం ఏది?
జ : సల్ఫ్యూరిక్ ఆమ్లము
10) లోహ పాత్రలతో పోలిస్తే మట్టి పాత్రలో ఉడికిన ఆహారం రుచిగా ఉండటానికి కారణం ఏమిటి.?
జ : విశిష్టోష్ణము
11) హైదరాబాద్ ఇమామ్ భూముల రద్దు చట్టాన్ని ఎప్పుడు చేశారు.?
జ : 1955
12) హైదరాబాద్ రెగ్యులేషన్ (జాగీర్ధర్ రద్దు) చట్టాన్ని ఎప్పుడు చేశారు.?
జ : 1949 ఆగస్టు 15
13) మెండలీఫ్ ఆవర్తన పట్టికను దేని ఆధారంగా రూపొందించాడు.?
జ : పరమాణు భారం
14) స్కాండియం మూలకాన్ని కనుగొన్నది.?
జ : నీల్సన్
15) ఉలూఘ్ ఖాన్ మరోపేరు ఏమిటి.?
జ : మహ్మద్ బీన్ తుఘ్లక్
16) పిల్లలమర్రి పట్టణాన్ని నిర్మించిన వారు ఎవరు.?
జ : రేచర్ల భేతిరెడ్డి