DAILY GK BITS IN TELUGU MAY 03

GK BITS

DAILY G.K. BITS IN TELUGU MAY 03

1) వైద్య పరీక్షలలో ఉపయోగించే రేడియో ఐసోటోప్ లను ఏమని పిలుస్తారు.?
జ : ట్రేసర్స్

2) కార్బన్ డేటింగ్ పద్ధతిని దేనిని గుర్తించడానికి వాడతారు.?
జ : వయస్సు

3) అలీన ఉద్యమ మొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది.?
జ : బెల్ గ్రేడ్ (యుగోస్లోవియా)

4) బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : కోల్‌కతా (పశ్చిమబెంగాల్)

5) పీవీ నరసింహారావు ఆత్మకథను తెలుగులో ఏ పేరుతో ప్రచురించారు.?
జ : లోపలి మనిషి

6) ప్రపంచ జల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 22

7) హరిత విప్లవం కారణంగా భూసారం లో వచ్చిన మార్పు ఏమిటి.?
జ : భూసారం తగ్గింది

8) ఆపరేషన్ ఫ్లడ్ అనగా ఏమిటి.?
జ : పాల విప్లవము

9) ఆపరేషన్ ఫ్లడ్ పితామహుడు ఎవరు.?
జ : వర్గీస్ కురియన్

10) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వపు పేరు .?
జ : ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

11) అలహాబాద్ శాసనాన్ని రూపొందించినది ఎవరు?
జ : హరిసేనుడు

12) మొహంజదారో ఏ నది తీరంలో ఉంది.?
జ : సింధూ నది కుడి ఒడ్డున

13) గుప్తుల కాలంలో విడుదల చేసిన వెండి నాణేలను ఏమని పిలుస్తారు.?
జ : రూపక

14) గుప్తుల కాలంలో వైద్యానికి పేరు మోసిన వారు ఎవరు.?
జ : శుశ్రుతుడు

15) శివాజీ ఏ కుటుంబానికి చెందినవాడు.?
జ : బోంస్లే