DAILY GK BITS IN TELUGU MARCH 14th
1) సాధారణ ఎఫ్.ఎం రేడియో స్టేషన్ నుంచి ప్రసారమయ్యే రేడియో తరంగా పౌనఃపున్యం ఎంత.?
జ : 93.5 M.Hz
2) కాకతీయుల కాలంలో వసూలు చేసే ఆస్తి పన్నును ఏ పేరుతో పిలుస్తారు.?
జ : పుల్లరి
3) తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ స్లోగన్ ఏమిటి.?
జ : మన ఊరు – మన చెరువు
4) భారత రాజ్యాంగంలో ఉమ్మడి పౌరస్మృతి ఏ అధికరణ ప్రకారం కల్పించారు.?
జ : 44వ అధికరణ
5) “ప్రాణహిత” అనే వ్యాస సంపుటాన్ని రచించినది ఎవరు?
జ : అల్లం నారాయణ
6) ఆవరణ వ్యవస్థకు ప్రధాన ఇంధనం ఏమిటి.?
జ : సూర్యుడు
7) వాయు కాలుష్యం ఏ ఆవరణలో ప్రధానంగా ఉంటుంది.?
జ : ట్రోపో స్పియర్
8) తెలంగాణ రాష్ట్రంలో బాల బ్రహ్మేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది.?
జ : ఆలంపూర్ – జోగులాంబ గద్వాల జిల్లా
9) రజాకార్ అనే పదానికి భాషాపరమైన అర్థం ఏమిటి?
జ : స్వచ్ఛంద కార్యకర్త
10) జాతీయ గర్ల్ చైల్డ్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 24
11) బాల్య వివాహాలను వ్యతిరేకించడానికి పూనేలో మహిళా ఆర్య సమాజ్ ఎవరు స్థాపించారు.?
జ : పండిత రమాబాయి సరస్వతి
12) ఉపగ్రహాల నుండి సంకేతాలను సంగ్రహించే స్టేషన్ తెలంగాణలో ఎక్కడ ఉంది.?
జ : షాద్ నగర్
13) ఏ రకమైన తెల్ల రక్త కణాలను పారిశుద్ధ్య కార్మికులు అని పిలుస్తారు.?
జ : మోనోసైట్స్
14) ఏ జీవులలో స్వేచ్ఛ రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.?
జ : కీటకాలు
15) బ్రహ్మపుత్రా నది ఎక్కడ జడ పిన్ను ఆకారంలో మలుపు తిరిగి ప్రవహిస్తుంది.?
జ : నమ్చా బర్వా