Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 3rd AUGUST

DAILY GK BITS IN TELUGU 3rd AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 3rd AUGUST

DAILY GK BITS IN TELUGU 3rd AUGUST

1) మాట్లాడే భాషలకు కేంద్రం గుర్తింపు ఇచ్చే అంశం రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ లో ఉంది.?
జ : ఎనిమిదవ షెడ్యూల్

2) మిషన్ భగీరథ కార్యక్రమం కింద మున్సిపాలిటీలలోని ఒక ఇంటికి రోజుకు ఎన్ని లీటర్ల శుద్ధి చేసిన నీరు అందించబడుతుంది.?
జ : 135 లీటర్లు

3) “ముచిలింద నాగ” అనే ఐదు తలలు గల సర్పం ఎవరిని రక్షించినట్లు చరిత్ర చెబుతుంది.?
జ : గౌతమ బుద్ధుడు

4) ‘నౌక చరితం’ మరియు ‘పంచరత్న కృతులు’ అనే గ్రంధాలు రచించినది ఎవరు.?
జ : త్యాగరాజు

5) హిందూస్థానీ ఏ రెండు భాషల కలయిక.?
జ : హిందీ మరియు ఉర్దూ

6) ‘అనులోమా వివాహం’ అంటే ఏమిటి .?
జ : ఉన్నత కులానికి చెందిన పురుషుడు తక్కువ కులానికి చెందిన స్త్రీల మధ్య వివాహం

7) ఏ స్థూపాన్ని దాని కొలత ఆధారంగా విరాట్ స్తూపం అని పిలుస్తారు.?
జ : నేలకొండపల్లి స్థూపం

8) భారతదేశంలో మొట్టమొదటిసారి బయో ఇంధనాన్ని దేని నుండి తయారు చేశారు.?
జ : జట్రోపా నూనె

9) బిడ్డ పుట్టిన తర్వాత శిశువుకు ఇచ్చే వ్యాక్సిన్ల క్రమం ఏమిటి.?
జ : హెపటైటిస్ – బి, పోలియో, తట్టు – గవదబిల్లలు – రూబెల్లా.

10) అంటార్కిటికా ఖండంలో భారత్ ఏర్పరిచిన అంటార్కిటికా పరిశోధన కేంద్రాలు ఏవి.?
జ : దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి,

11) భారతీయ అటవీ సర్వే 2001 ప్రకారం భారత్ ను ఎన్ని భౌగోళిక మండలాలుగా విభజించారు.?
జ : 14

12) “సీరల్” అనే పండగ తెలంగాణలోని ఏ ముఖ్య తెగకు చెందింది.?
జ : అంద్

13) పరారుణ కిరణాలు ఎవరు కనుగొన్నారు.?
జ : విలియం హెర్షల్

14) వేడిగా ఉన్న వస్తువుల నుండి ఉష్ణం ఏ రూపంలో వెలబడుతుంది.?
జ : పరారుణ కిరణాలు

15) ఉష్ణవికిరణాలు అని ఏ కిరణాలకు పేరు.?
జ : పరారుణ కిరణాలు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు