DAILY GK BITS IN TELUGU 30th MAY

GK BITS

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 30th MAY

DAILY GK BITS IN TELUGU 30th MAY

1) సెప్టెంబర్ 30 – 2012 నాడు జరిగిన తెలంగాణ మార్చ్ ను ప్రముఖంగా ఏమని పిలుస్తారు.?
జ : సాగరహారం

2) పార్లమెంట్ లో అనుసరించే జీరో అవర్ కాలపరిమితి ఎంత.?
జ : నిర్ణీత సమయం ఉండదు

3) 2003లో 92 వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్ కు చేర్చబడిన భాషా సమూహం ఏది?
జ : బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి

4) లక్ష్య దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి.?
జ : కేరళ హైకోర్టు

5) ఏ ఆర్టికల్ ద్వారా రాజ్యం మహిళలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది.?
జ : ఆర్టికల్ 15 (3)

6) రాజ్యాంగంలోని అత్యవసర అధికారాలు ఏ దేశం నుండి గైకొనబడ్డాయి.?
జ : జర్మనీ

7) ఏ రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలను రిజర్వేషన్ల నుండి మినహాయించారు.?
జ : అరుణాచల్ ప్రదేశ్

8) శ్రీ పర్వతం అని దేనిని పిలుస్తారు.?
జ : నాగార్జున కొండ నుండి శ్రీశైలం వరకు ఉన్న పర్వతం

9) తెలంగాణ మాండలికంలో దస్తకత్ అంటే ఏమిటి.?
జ : సంతకం

10) మోదుగ పూలు ఎవరి రచన.?
జ : దాశరధి రంగాచార్య

11) గోల్కొండ కోట పై గల బురుజుల సంఖ్య ఎంత.?
జ : 87

12) హైదరాబాదులోని ఏ కట్టడం మొగల్ చక్రవర్తి ఔరంగజేబు చే పూర్తిగావించబడింది.?
జ : మక్కా మసీద్

13) ఏ నదికి తేలివాహ అనే నామాంతరం ఉన్నది.?
జ : గోదావరి

14) వెంకటరావు ఖడ్ కేఖర్ ఏ పేరుతో ప్రసిద్ధులు.?
జ : స్వామి రామానంద తీర్థ

15) 2015 లో తెలంగాణకు హరితహారం పథకాన్ని ఎన్ని కోట్ల మొక్కలను నాటి పోషించడానికి ఉద్దేశించారు.?
జ : 230 కోట్ల మొక్కలు

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు