DAILY GK BITS IN TELUGU 2nd AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 2nd AUGUST

DAILY GK BITS IN TELUGU 2nd AUGUST

1) ఏ ఇక్ష్వాక రాజు వ్యవసాయ అభివృద్ధి కోసం నాగలి, ఆవులు, ఎద్దులు దానం చేసినట్లు చెప్పబడింది.?
జ : శాంత మూలుడు

2) వరంగల్ లో ఉన్న పద్మాక్షి ఆలయం ఏ మతానికి అనుబంధంగా ఉన్న దేవాలయము.?
జ : జైన మతం

3) టీం ఇండియా మరియు నాలెడ్జ్ & ఇన్నోవేషన్ హబ్ అనేది ఏ సంస్థ యొక్క ప్రధాన అంగాలు.?
జ : నీతి ఆయోగ్

4) చైనా దేశంలో వ్యోమగామి ని ఏమని పిలుస్తారు.?
జ : టైకోనాట్

5) జర్మనీ దేశంలో వ్యోమగామి ని ఏమని పిలుస్తారు.?
జ : స్పేషియోనాట్

6) ఏ సంవత్సరం నాటికి జీరో కార్బన్ ఉద్గారల లక్ష్యాన్ని సాధించడానికి భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 2070

7) FAO నివేదిక ప్రకారం ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తిలో భారత్ వాటా ఎంత.?
జ : 41%

8) వాతావరణ మార్పులపై జరిగిన పారిస్ ఒప్పందంలో ఎన్ని పార్టీల మధ్య చట్టబద్ధ ఒప్పందం కుదిరింది.?
జ : 196

9) భారతదేశపు మొట్టమొదటి అధిక స్వచ్ఛత బంగారం నాణ్యత ప్రమాణము BND 420 లో BND అంటే ఏమిటి.?
జ : భారతీయ నిధి ద్రవ్య

10) దేశంలో సాధారణంగా వ్యవసాయ లెక్కలను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.?
జ : 5 సంవత్సరాలు

11) గొండాలి అనగానేమి.?
జ : ఒక నృత్య రూపకం

12) దశరథరాజ నందన గ్రంథ కర్త సింగరాచార్యులు ఏ రాజుల కాలానికి చెందిన వారు.?
జ : కుతుభ్‌ షాహీలు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు