DAILY GK BITS IN TELUGU 29th JUNE

GK BITS

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 29th JUNE

DAILY GK BITS IN TELUGU 29th JUNE

1) ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : మనీలాలో ఉంది.

2) మహాత్మా గాంధీ ఎక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.?
జ : బెల్గాంలో (1924).

3) భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బ్రిటన్ ప్రధాన మంత్రి ఎవరు.?
జ : క్లెమెంట్ అట్లీ

4) తాన్సేన్, సంగీత సామ్రాట్ ఎక్కడ జన్మించాడు.?
జ : గ్వాలియర్ (MP)లో

5) స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థను ఎవరు స్థాపించారు.?
జ : రాబర్ట్ బాడెన్ పావెల్

6) దక్షిణ తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండల ప్రధాన కేంద్రం గల ప్రాంతం ఏది.?
జ : పాలెం

7) మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరు.?
జ : రుద్ర దేవుడు

8) తెలంగాణలో ఆటోమేటిక్ సైఫన్ టెక్నాలజీతో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టు ఏది.?
జ : సరళ సాగర్

9) సిర్నవల్లి గుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి.?
జ : నిజామాబాద్

10) తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ కల కేంద్రం.?
జ : దూలపల్లి

11) తెలంగాణలో అత్యధిక జనాభా పెరుగుదల రేటును నమోదు చేసుకున్న దశాబ్దం.?
జ : 1981- 91

12) ఎల్ నినో సముద్ర ప్రవాహం ప్రయణించే తీరం.?
జ : దక్షిణ అమెరికా

13) భారత్ లోని ఏ రాష్ట్రంలో చెరుకు అత్యదిక విస్తీర్ణంలో సాగు చేస్తారు.?
జ : ఉత్తరప్రదేశ్

14) ఏ అక్షాంశ రేఖను గ్రేట్ సర్కిల్ అంటారు.?
జ : భూమధ్యరేఖ

15) జువారు గనులు దేనికి ప్రసిద్ధి.?
జ : జింకు మరియు సీసం

16) భారతదేశంలో అంబుడ్స్‌మన్ లాంటి సంస్థల ఏర్పాటును ప్రతిపాదించినది ఎవరు?
జ : న్యాయమూర్తి చంద్రచూడ్

17) కొరియో లిస్ బలం విలువ ఎక్కడ సున్నాగా ఉంటుంది.?
జ : భూమధ్య రేఖ వద్ద

18) బహుజన అనే పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరు.?
జ : బుద్ధుడు

19) రాజ్యాంగ ప్రవేశికలో ఐక్యత మరియు దేశ సమగ్రత అనే పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు.?
జ : 1976

20) మొదటి భారత నిఘా కమిషనర్ ఎవరు.?
జ : కె.వి చౌదరి

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు