DAILY GK BITS IN TELUGU 26th AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 26th AUGUST

DAILY GK BITS IN TELUGU 26th AUGUST

1) న్యూక్లియర్ రియాక్టర్ ఆవిష్కర్త ఎవరు.?
జ : ఫెర్మి

2) ఆప్టికల్ ఫైబర్ పితామహుడు ఎవరు.?
జ : నరేంద్ర సింగ్ కపానీ

3) ధ్వని తీవ్రతను కొలిచే సాదనం ఏది.?
జ : ఆడియో మీటర్

4) ధ్వని ఫిచ్ దేనిపై ఆధారపడి ఉంటుంది.?
జ : పౌనఃపున్యం

5) నీటి లోపలి ధ్వని తరంగాలను కొలిచే పరికరం ఏది.?
జ : హైడ్రోపోన్

6) డాప్లర్ ప్రభావం దేనికి సంబంధించింది.?
జ : ధ్వని

7) మాక్ నంబర్ దేని వేగానికి సంబంధించింది.?
జ : యుద్ధ విమానం

8) అల్ట్రా సోనిక్ శబ్దాలు వినగలిగే జంతువు ఏది.?
జ : గబ్బిలం

9) ఆర్థిక లోటుకు సరైన నిర్వచనం ఏది.?
జ : రుణం తీసుకోవడం మినహా మొత్తం వ్యయం మొత్తం వసూళ్ల మధ్య వ్యత్యాసం

10) తాంతియాతోపే యొక్క సైన్యాధిపతి ఎవరు.?
జ : నానా సాహెబ్

11) మొగల్ చక్రవర్తి ఏ సంవత్సరంలో బెంగాల్ దివాన్ గా ఈస్టిండియా కంపెనీని నియమించాడు.?
జ : 1765

12) పారా మౌంట్సీ విధానం ఎవరి కాలంలో అమలు చేయబడింది.?
జ : లార్డ్ హేస్టింగ్స్

13) బాక్సర్, ప్లాసి, శ్రీరంగపట్నం యుద్దాలను అవి జరిగిన కాలక్రమంలో మొదటి నుంచి చివరికి అమర్చండి.?
జ : ప్లాసీ – బాక్సర్ – శ్రీరంగపట్నం

14) రౌలత్, ఉప్పు సత్యాగ్రహం, చౌరి చౌరా సంఘటనలను అవి జరిగిన కాలక్రమంలో మొదటి నుండి చివరికి అమర్చండి.?
జ : రౌలత్ – చౌరీ చౌరా – ఉప్పు సత్యాగ్రహం.

15) ఏ రాజ్యాంగ చట్టాల అమలుతో స్థానిక ప్రభుత్వాన్ని అధికారికం చేశారు.?
జ : 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు

16) భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల రూపకల్పనకు ఎవరి కాలంలో బీజం పడింది .?
జ:లార్డ్ రిప్పన్

17) భారతదేశ అటార్నీ జనరల్ ను ఎవరు నియమిస్తారు.?
జ: రాష్ట్రపతి

18) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు స్థాపన మరియు నిర్మాణాన్ని వివరిస్తుంది.?
జ : ఆర్టికల్ 124

19) ఖైదీలకు క్షమాబిక్ష పెట్టడానికి రాష్ట్రపతికి అధికారం ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది.?
జ :ఆర్టికల్ 72

20) సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అందించి ఆర్టికల్ ఏది.?
జ : 39A

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు