Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 20th MAY

DAILY GK BITS IN TELUGU 20th MAY

GK BITS

DAILY G.K. BITS IN TELUGU 20th MAY

1) సతి సహగమనంపై నిషేధం విధించిన సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : విలియం బెంటింక్

2) కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనంపై ఏర్పడిన కమిటీలు ఏవి.?
జ : రాజా మన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, పూంచి కమిషన్

3) ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదని తెలిపే రాజ్యాంగ సవరణ ఏది?
జ : 42వ సవరణ

4) పండిన మామిడి పండ్లలో ప్రధానంగా ఉండే విటమిన్ ఏది?
జ : విటమిన్ – A

5) పసిఫిక్ మహాసముద్ర సునామి హెచ్చరిక కేంద్రము ఎక్కడ ఉంది.?
జ : హవాయి

6) ఏ ద్వీపానికి అబ్దుల్ కలాం పేరు పెట్టారు.?
జ : వీలర్ ద్వీపం

7) నిర్భయ సంఘటన విచారణ కోసం ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది?
జ : జస్టిస్ ఉష మెహ్రా కమిషన్

8) రాజ్యాంగంలో ఏ అధికరణ సామాజిక న్యాయం అనే భావనను కలిగి ఉన్నది.?
జ : 38వ అధికరణ

9) వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది.?
జ : 1986

10) ది అన్ సీన్ ఇందిరాగాంధీ పుస్తక రచయిత ఎవరు?
జ : కెపి మాథుర్

11) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తుంది..?
జ : 560 చదరపు అడుగులు

12) నీలి ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి.?
జ : సముద్ర ఆధారిత ఆర్థిక అభివృద్ధి

13) గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏ రాష్ట్ర పక్షి.?
జ : రాజస్థాన్

14) అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టే ఐరాస సంస్థ ఏది.?
జ : UNEP (UN – ఎన్విరాన్‌మెంటల్ ప్రోగ్రాం)

15) ప్రమాదంలో ఉండే జీవజాతులను సూచించే బుక్ పేరు ఏమిటి.?
జ : రెడ్ డేటా బుక్